డిజాస్టర్ హీరోల అదృష్ట లక్ష్మీ!!


సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం వరలక్ష్మి శరత్ కుమార్ పేరు మారు మ్రోగిపోతోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా ఆమె వరుసగా తెలుగు సినిమాలు చేయడమే కాకుండా బాక్సాఫీస్ హిట్స్ కూడా అందుకుంటోంది. ఆమె చేస్తున్న పాత్రలకు కూడా రెస్పాన్స్ గట్టిగానే వస్తోంది. ఇక డిజాస్టర్ హీరోలకు ఇటీవల ఆమె ఎంట్రీ బాగానే కలిసొచ్చింది.

రాజా ది గ్రేట్ తరువాత ఇంతవరకు హిట్ లేని మాస్ రాజా క్రాక్ సినిమాతో బాక్సాఫీస్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమాలో ఆమె జయమ్మా అనే నెగిటివ్ పాత్రలో నటించి సినిమాలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. ఇక అల్లరి నరేష్ నాందిలో లాయర్ పాత్రలో మెరిసిన వరలక్ష్మి సినిమాకు చాలా ప్లస్ అయ్యింది. సుడిగాడు తరువాత హిట్టు చూడని నరేష్ కు కూడా ఆమె వల్ల విజయం దక్కింది. ఇద్దరు హీరోలు చాలా కాలం తరువాత హిట్ అందుకోవడంతో వరలక్ష్మి ఇప్పుడు అదృష్టలక్ష్మీ గా మారింది. మరి రానున్న రోజుల్లో ఆమె ఇంకెలాంటి పాత్రల్లో హిట్స్ ఇస్తుందో చూడాలి.Post a Comment

Previous Post Next Post