టాలీవుడ్ ఇండస్ట్రీకి మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చిన క్రాక్, ఉప్పెన సినిమాలకు ఇండస్ట్రీ మొత్తం స్పెషల్ గా థాంక్స్ చెబుతోంది. బాక్సాఫీస్ మళ్ళీ ట్రాక్ లోకి వస్తుందా లేదా అని అనుకుంటున్న తరుణంలో ఆఖరికి నరేష్ కూడా 8 ఏళ్ళ తరువాత ప్రాఫిట్స్ అందుకున్నాడు. ఇక గత వారం నాలుగు సినిమాలు రిలీజ్ అవ్వగా ఈ వారం మొత్తంగా ఆరు సినిమాలు రాబోతున్నాయి.
నితిన్ ‘చెక్’, నందితా శ్వేతా ‘అక్షర’, జేడీ చక్రవర్తి నటించిన ‘70ఎంఎం’, అలానే ‘అంగుళీక’, ‘క్షణక్షణం’, ‘నిన్నిలా నిన్నిలా ‘ ఇలా మొత్తం ఆరు సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఇక ఈ సినిమాలలో ఎక్కువగా అందరి చూపు నితిన్ చెక్ పైనే ఉంది. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కింది. ఉరిశిక్ష పడిన చెస్ ప్లేయర్ ఎలాంటి ఆలోచనలతో బయటపడ్డాడు అనే పాయింట్ తోనే సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేశారు. మరి నితిన్ చెక్ సినిమాతో పాటు మిగతా సినిమాలు ఎంతవరకు క్లిక్కవుతాయో చూడాలి.
Follow @TBO_Updates
Post a Comment