ఉప్పెన రీమేక్.. హీరోగా తలపతి తనయుడు?


టాలీవుడ్ 2021 బిగ్గెస్ట్ గ్రాస్ కలెక్షన్స్ అందుకున్న సినిమాలో ప్రస్తుతం టాప్ 1లో ఉంది ఉప్పెన. చూస్తుంటే సుకుమార్ చెప్పిన మాట నిజమయ్యేలా ఉంది. 90 నుంచి 100కోట్ల వరకు బిజినెస్ చేయవచ్చని అంచనాలు వేసేస్తున్నారు. ఇప్పటికే 50కోట్ల మార్క్ అందుకున్నట్లు తెలుస్తోంది. ఈ స్థాయిలో విజయాన్ని అందుకుంటే ఇతర భాషల్లో రీమేక్ అవ్వకుండా ఉంటుందా?

బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఉప్పెనపై కథనాలు వెలువడుతున్నాయి. ఇక కోలీవుడ్ లో రీమేక్ కోసం చర్చలు కూడా మొదలైనట్లు టాక్. ఇక హీరోగా తలపతి విజయ్ తనయుడు జసన్ సంజయ్ ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. నెంబర్ వన్ డెబ్యూ హీరోగా వైష్ణవ్ తేజ్ ఎలాగైతే ఎంట్రీ ఇచ్చాడో సంజయ్ కూడా అలానే ఎంట్రీ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. విజయ్ సేతుపతి ఈ సినిమాను నిర్మించే ఛాన్స్ ఉన్నట్లు మరొక రూమర్ కూడా వైరల్ అవుతోంది. మరి ఈ న్యూస్ ఎంతవరకు నిజమో తెలియాలి అంటే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వచ్చే వరకు వేయిట్ చేయాల్సిందే.Post a Comment

Previous Post Next Post