Top News

Uppena Climax becomes Hot topic!!


టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉప్పెన సినిమా హాట్ టాపిక్ గా మారింది. వైష్ణవ్ తేజ్ నటిస్తున్న మొదటి సినిమా కావడంతో మొదటి నుంచి కూడా సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. పైగా దేవి శ్రీ ప్రసాద్ పాటలు కూడా సినిమా స్థాయిని మరింత పెంచేశాయి. అయితే సినిమాలో క్లైమాక్స్ సీన్ పై గత కొంతకాలంగా అనేక రకాల రూమర్స్ వస్తున్న విషయం తెలిసిందే.

సినిమాలో అదే హైలెట్ అని కాకపోతే ఆడియెన్స్ కు ఎంతవరకు కనెక్ట్ అవుతుందనేది సినిమా చూసేవరకు తెలియదు. చిత్ర యూనిట్ అయితే నమ్మకంతోనే ఉన్నట్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ తో క్లారిటీ వచ్చేసింది. మెగాస్టార్ చిరంజీవి కూడా క్లైమాక్స్ సీన్ గురించి మొదట విన్నప్పుడు కాస్త కంగారు పడినట్లు ఈవెంట్ లో చెప్పేశారు. ఇక సినిమా చూసిన తరువాత దర్శకుడు చాలా పర్ఫెక్ట్ గా హార్ట్ ను టచ్ చేసేంత ఎమోషనల్ గా ప్రజెంట్ చేసినట్లు వివరణ ఇచ్చారు. హీరోకు విలన్ కలిగించే నష్టమే ఈ సినిమాలో ఊహించని విధంగా ఉంటుందట. ఇప్పటికే రకరకాల కథనాలు ఈ విషయంపై వైరల్ అవుతున్నాయి. చూడాలి మరి దర్శకుడు ఎలా ప్రజెంట్ చేశాడో..



Post a Comment

Previous Post Next Post