క్రాక్ అసిస్టెంట్ డైరెక్టర్ తో మాస్ రాజా న్యూ ప్రాజెక్ట్!!


ఒక సినిమా హిట్టయితే హీరోలకు వెను వెంటనే కొత్త అవకాశాలు రావడం కామన్. ఇక మాస్ రాజా కూడా ప్రస్తుతం వారానికో కథ వింటున్నాడు. ఇటీవల క్రాక్ సినిమాతో బిగ్గెస్ట్ బాక్సాఫీస్ హిట్ అందుకుంటున్న మాస్ రాజా అదే ఫ్లోలో వెళ్లాలని కథలను సెలెక్ట్ చేసుకుంటున్నాడు. వీలైనంత వరకు సేఫ్ జోన్ లోనే ఉండేలా కమర్షియల్ సినిమాలను ఒకే చేస్తున్నాడు.

ఇక రవితేజ మరో కొత్త దర్శకుడు చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వస్తోంది. క్రాక్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసిన గులాబీ శ్రీను చెప్పిన కథపై లక్ డౌన్ నుంచి చర్చిస్తున్నారట. ఇక మొత్తానికి ఇటీవల ఫైనల్ స్క్రిప్ట్ ని వినిపించగా వీలైనంత త్వరగా సినిమాను స్టార్ట్ చేయాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం రవితేజ ఖిలాడి సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇక త్వరలోనే కొత్త దర్శకుడి కథపై అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఇవ్వానున్నట్లు సమాచారం.Post a Comment

Previous Post Next Post