ఎన్టీఆర్ తో సినిమా.. క్లారిటీ ఇచ్చిన ఉప్పెన దర్శకుడు!!


టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్కసారిగా సంచలనం సృష్టించింది ఉప్పెన సినిమా. అప్పుడెప్పుడో అల.. వైకుంఠపురములో, సరిలేరు నికేవ్వరు సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సాలీడ్ ఓపెనింగ్స్ అందాయి. ఇక ఏడాది అనంతరం మీడియం బడ్జెట్ మూవీస్ లో ఆ రేంజ్ లో ఓపెనింగ్స్ అందుకుంది ఉప్పెన. సినిమా దర్శకుడిపై ఇప్పుడు భారీ స్థాయిలో ప్రశంసలు వెలువడుతున్నాయి.

దర్శకుడు బుచ్చిబాబు టాలెంట్ పై ముందే అందరికి ఒక క్లారిటీ వచ్చేసింది. ఈ క్రమంలో అతని నెక్స్ట్ సినిమా ఎలా ఉంటుందని అందరు చర్చించుకుంటున్నారు. ముందే మైత్రి మూవీ మేకర్స్ కు కమిట్మెంట్ ఇచ్చేశాడు. అయితే ఎన్టీఆర్ తో సినిమా ఉంటుందా లేదా అనే విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పాడు. ప్రస్తుతం కథ చర్చలు జరుగుతున్నాయి. హీరో ఎవరనేది ఇంకా అనుకోలేదని, అయితే ఆ కథ కూడా చాలా కొత్తగా ఉంటుందని అన్నాడు.Post a Comment

Previous Post Next Post