Unexpected: SALAAR is a remake says Music Director!!
Saturday, February 13, 2021
0
రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి రాబోతున్న బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాల్లో సలార్ ఒకటి. ఈ సినిమా కోసం అభిమానులు ఏ రేంజ్ లో ఎదురుచేస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే మొదట ఈ సినిమా కన్నడ ఉగ్రమ్ సినిమాకు రీమేక్ అని టాక్ వచ్చింది. కానీ దర్శకుడు అందులో నిజం లేదని క్లారిటీ ఇచ్చేశాడు.
అయితే KGF మ్యూజిక్ డైరెక్టర్ రవి బసృర్ మాత్రం దర్శకుడి మాటలకు రివర్స్ గా ఆన్సర్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ సలార్ సినిమాకు కూడా భారీ స్థాయిలో మ్యూజిక్ కంపోజింగ్ చేస్తున్నట్లు చెబుతూ.. ఇది ఉగ్రమ్ సినిమాకు రీమేక్ అని అందరికి తెలిసిన విషయమే కదా అని ఓ మాట అనేశాడు. దీంతో ఒక్కసారిగా అభిమానుల్లో మళ్ళీ కన్ఫ్యూజన్ మొదలైంది. మరి దర్శకుడు ఈ విషయంపై ఎలాంటి క్లారిటీ ఇస్తాడో చూడాలి.
Follow @TBO_Updates
Tags