Uppena Profits.. Sukumar's Shocking Share!!


టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా రోజుల తరువాత అసలైన బాక్సాఫీస్ హిట్ నమోదైంది. ఎమోషనల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఉప్పెన ఆడియెన్స్ హార్ట్ ను టచ్ చేయడంతో నిర్మాతల జేబులు కూడా గట్టిగానే నిండాయి. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు ఈ సినిమాను డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఉప్పెన వలన సుకుమార్ కూడా లాభాలు గట్టిగానే అందుకున్నాడు.

ఉప్పెన నిర్మాణంలో మైత్రి మూవీ మేకర్స్ తో పాటు సుకుమార్ రైటింగ్స్ కూడా ఒక పాట్నర్. ఫస్ట్ ఈ కథను సుకుమార్ నమ్మి ఆ తరువాత మైత్రికి అప్పగించాడు. సినిమా కలెక్షన్స్ అనే కాకుండా నాన్ థియేట్రికల్ గా కూడా మంచి లాభాలను అందించింది. దీంతో మొత్తంగా 40కోట్లకు పైగా లాభాలు వచ్చే ఛాన్స్ ఉందట. ఇక సుకుమార్ కు అందులో సగం.. అంటే 20కోట్ల వరకు షేర్ ఇచ్చినట్లు సమాచారం. ఇక హీరో, హీరోయిన్ కు అలాగే డైరెక్టర్ బుచ్చిబాబుకు కూడా గిఫ్ట్స్ రూపంలో మరికొంత ఇచ్చినట్లు సమాచారం.Post a Comment

Previous Post Next Post