Vijay Sethupathi remuneration is more than Bollywood Superstar!!


కోలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న బెస్ట్ నటులలో విజయ్ సేతుపతి ఒకరు. ఎలాంటి పాత్ర చేసినా కూడా సినిమాలో అందరిని డామినేట్ చేయగల ఈ నటుడి వాల్యూ రోజురోజుకు మరింత పెరుగుతోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా వరుసగా పరభాషా సినిమాలను కూడా ఓకే చేస్తున్నాడు ఈ నటుడు. ఇక త్వరలో బాలీవుడ్ కి చెందిన వెబ్ సిరీస్ లో కూడా కనిపించబోతున్నాడు.

బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్ త్వరలోనే డిజిటల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.  అందులో విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషిస్తున్న విషయం అందరికీ తెలిసిందే.  సన్నీ టైటిల్ తో రానున్న ఆ వెబ్ సిరీస్ ను రాజ్ & డికె తెరకెక్కిస్తున్నారు.
ఇదిలావుండగా ఈ సిరీస్ కోసం షాహిద్ కపూర్ కంటే విజయ్ సేతుపతి ఎక్కువ పారితోషికం తీసుకోబోతున్నట్లు సమాచారం. ఇక అమెజాన్ ప్రైమ్ వీడియో నిర్మిస్తున్న ఈ ఎనిమిది ఎపిసోడ్ల సిరీస్‌లో ప్రముఖ హీరోయిన్ రాశి ఖన్నా కూడా ముఖ్య పాత్రలో నటించనుంది.


Post a Comment

Previous Post Next Post