Pawan - Mahesh clash for Sankranthi 2022??


టాలీవుడ్ లో అత్యదిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో పవన్ కళ్యాణ్ ఒకరు. అదే రేంజ్ లో అభిమానులను సంపాదించుకున్నాడు మహేష్ బాబు. ఈ ఇద్దరు కూడా బాక్సాఫీస్ వద్ద ఎన్నో రికార్డులను క్రియేట్ చేశారు. అయితే ఇలాంటి స్టార్ హీరోల సినిమాలు ఒకే సమయంలో విడుదలైతే ఆ వాతావరణం ఎలా ఉంటుందో ఊహించడమే కష్టం. 

మహేష్ బాబు సర్కారు వారి పాట 2022 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి రాబోతున్న విషయం తెలిసిందే. ఇక అదే సమయానికి పవన్ కళ్యాణ్ - క్రిష్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కూడా విడుదల కానున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. రెండు సినిమాలపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. సంక్రాంతి సీజన్ కాబట్టి రెండు పెద్ద సినిమాలకు పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. ఈ ఇద్దరు గనక పొంగల్ భరిలో దిగితే మరొక హీరో మాత్రం అస్సలు రారని తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..


Post a Comment

Previous Post Next Post