Pawan was not first choice in HariHara Veera Mallu!!
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు పాన్ ఇండియా సినిమాలను బ్యాక్ టూ బ్యాక్ సెట్స్ పైకి తీసుకొస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా కెరీర్ లో మొదటిసారి బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా మూవీతో సిద్ధమవుతున్నాడు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమా దాదాపు 150కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. అయితే ఈ సినిమా కథ రాసుకున్నప్పుడు దర్శకుడు క్రిష్ హీరోగా పవన్ కళ్యాణ్ ను అనుకోలేదట. మెగా హీరో వరుణ్ తేజ్ తో చేయాలని ప్లాన్ వేశాడట. కానీ సినిమా బడ్జెట్ అతని మార్కెట్ కు తగ్గట్లు లేకపోవడంతో పవర్ స్టార్ ను సెలెక్ట్ చేసుకున్నాడట. పైగా పవన్ ఇంతవరకు ఇలాంటి జానర్ ను టచ్ చేయలేదు కాబట్టి తప్పకుండా సినిమా బాక్సాఫీస్ వద్ద సాలీడ్ వసూళ్లను అందుకోగలదని దర్శకుడు ఆలోచించాడని తెలుస్తోంది. ఇక మూవీని సంక్రాంతి సందర్భంగా 2022 సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
0 Comments