వకీల్ సాబ్ ట్రైలర్ తో బాక్సాఫీస్ కు హెచ్చరికలు వెళ్లినట్లు చాలా క్లారిటిగా అర్ధమయ్యింది. మూడేళ్ళ అనంతరం పవన్ కళ్యాణ్ సినిమా వెండితెరపై పడుతుండడంతో అభిమానుల్లో అంచనాల డోస్ అకాశాన్ని దాటేశాయి. అయితే సినిమాకు సంబంధించిన బిజినెస్ డీలింగ్స్ పై ఇటీవల అనేక రకాల రూమర్స్ వచ్చాయి.
పలు ఏరియాల్లో దిల్ రాజు ఆశించినంత ధర రావడం లేదని టాక్ వచ్చింది. టీజర్ కు అనుకున్నంతగా రెస్పాన్స్ రాకపోవడమే అందుకు కారణమని కథనాలు వచ్చాయి.
ఇప్పుడే వచ్చిన ఆఫర్స్ కు ముందే అమ్మేసుకుంటే బెటర్ అనే కామెంట్స్ కూడా వచ్చాయి. కానీ ఈ సీనియర్ నిర్మాత టెంప్ట్ అవ్వలేదు.
తప్పకుండా సినిమా బాక్సాఫీస్ వద్ద క్లిక్కవుతుందని ట్రైలర్ తో క్లారిటీ ఇచ్చేశాడు. 24గంటల్లోనే అత్యదిక లైక్స్, వ్యూవ్స్ అందుకున్న టాలీవుడ్ ట్రైలర్ గా సెన్సేషన్ క్రియేట్ చేసిన వకీల్ సాబ్ కు నలుదిక్కులా సాలీడ్ డిమాండ్ పెరిగినట్లు సమాచారం. దిల్ రాజు ఆశించినదానికంటే ఎక్కువ స్థాయిలో సినిమా బిజినెస్ జరగనున్నట్లు టాక్. మరికొన్ని రోజుల్లో ప్రీ రిలీజ్ కు సంబంధించిన అసలైన నెంబర్లు బయటకు రానున్నాయి.
Follow @TBO_Updates
Follow @TBO_Updates
Post a Comment