గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాల్లో జాతిరత్నాలు సినిమా బాక్సాఫీస్ వద్ద అగ్ర స్థానంలో నిలిచింది. మొదటి రోజే సినిమా 5కోట్లకు పైగా షేర్స్ ను అందుకుంది. అయితే దర్శకుడు అనుదీప్ తరువాత చేయబోయే సినిమా ఎలా ఉండబోతోంది అనే విషయంలో అప్పుడే రూమర్స్ మొదలయ్యాయి. అయితే దర్శకుడు ప్రెస్ మీట్ లో ఒక క్లారిటీ అయితే ఇచ్చేశాడు.
మార్షల్ ఆర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఒక డిఫరెంట్ కామెడీ సినిమా చేయాలని అనుకుంటున్నట్లు చెప్పాడు. పిట్టగోడ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన అనుదీప్ నాగ్ అశ్విన్ ను షార్ట్ ఫిలిమ్స్ ద్వారా ఎట్రాక్ట్ చేసి జాతిరత్నాలు సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చాడు. ఇక మొత్తానికి అందరి నమ్మకాన్ని నిజం చేసిన అనుదీప్ మరో సినిమాను వైజయంతి వారి సపోర్ట్ తోనే సినిమాను తెరకెక్కించాలని అనుకుంటున్నాడు. మరి ఆ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందో చూడాలి.
Follow @TBO_Updates
Post a Comment