నందమూరి బాలకృష్ణ, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల కలయిక కోసం అభిమానులు ఏ రేంజ్ లో ఎదురుచూస్తారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. వీరి కలుసుకునేది చాలా రేర్. ఇద్దరు ఒక ఫ్రేమ్ లో కనిపిస్తే అభిమానుల్లో తెలియని ఆనందం. ఇక చాలా రోజుల తరువాత ఎన్టీఆర్, బాలకృష్ణ కోసం ప్రమోషన్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.
బోయపాటి - బాలకృష్ణ కాంబినేషన్లో రూపొందుతున్న మాస్ యాక్షన్ సినిమా టైటిల్ ను తారక్ ద్వారా రిలీజ్ చేయించబోతున్నారట. BB3 టైటిల్ పై అనేక రకాల రూమర్స్ వస్తున్న విషయం తెలిసిందే. ఇక ఉగాది సందర్భంగా సినిమా టైటిల్ పై క్లారిటీ ఇవ్వాలని బోయపాటి ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా ద్వారా బాలయ్యకు సంబంధించిన పోస్టర్ తో పాటు టైటిల్ ను కూడా రిలీజ్ చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
Follow @TBO_Updates
Post a Comment