2022 సంక్రాంతి యుద్ధానికి ఇద్దరు బడా హీరోలు సిద్ధమయ్యారు. ఇక వాళ్ళ మధ్యలోకి రావడానికి ఎవరు కూడా సాహసం చేయరని చెప్పవచ్చు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఈ ఫైట్ హాట్ టాపిక్ గా మారింది. మహేష్ బాబు సర్కారు వారి పాట, పవన్ కళ్యాణ్ హారహర వీరమల్లు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నవే.
రెండు సినిమాలపై కూడా అభిమానుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే ముందు ఎవరు ఏ డేట్ కు వస్తారనేది ఆసక్తిగా మారింది. 2022 జనవరి 12 చాలా ముఖ్యమైన డేట్. 12 బుధవారం కాబట్టి అంతకు ముందు రోజు మంగళవారం యూఎస్ ప్రీమియర్స్ ద్వారా మంచి లాభాలు వస్తాయి. ఇక గురువారం భోగి, శుక్రవారం సంక్రాంతి.. శని ఆదివారాలు వీకెండ్స్ కాబట్టి మరో బోనస్. అందుకే జనవరి 12వ తేదీ ఇప్పుడు హాట్ కేక్ లా మారింది. ఆ డేట్ కు వచ్చిన సినిమా బాక్సాఫీస్ వద్ద ఈజీగా 100కోట్లను అందుకోగలదని చెప్పవచ్చు.
0 Comments