శర్వానంద్ శ్రీకారం సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ మాత్రం క్లిక్కవ్వలేదు. ఓపెనింగ్స్ తోనే పెట్టిన బడ్జెట్ ను వెనక్కి తీసుకోవాలని టికెట్స్ రేట్లను అమాంతంగా పెంచేశారు. మాస్ ఆడియెన్స్ నుంచి సినిమాకు ఏ మాత్రం ఆదరణ దక్కలేదు. విడుదలైన రోజు నుంచి ఇప్పటివరకు హౌజ్ ఫుల్ బోర్డులు దర్శనమివ్వలేదు. మరోవైపు జాతిరత్నాలు సినిమా తక్కువ థియేటర్స్ లో రిలీజై భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకుంటోంది. ఇప్పటికే పెట్టిన పెట్టుబడికి డబుల్ ప్రాఫిట్స్ అంధించింది.
జాతిరత్నాలు సినిమా వలన శ్రీకారం సినిమాకు యూత్ ఆడియెన్స్ దూరమయ్యారనే చెప్పాలి. ఈ టైమ్ లో సినిమా రిలీజ్ కాకుండా ఉంటే బెటర్ ఏమో అనిపిస్తోంది. సినిమా కంటెంట్ అయితే బాగానే ఉంది. ఓ వర్గం ఫ్యామిలీ ఆడియెన్స్ వీకెండ్స్ లో మాత్రమే వచ్చారు. కానీ జాతిరత్నాలు హవా ఒక్కసారిగా పెరగడంతో ప్రభావం గట్టిగానే చూపించింది. శ్రీకారం కనీసం ఇప్పటివరకు 10కోట్ల షేర్ కూడా అందుకోలేదు. సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 17కోట్ల వరకు ఉంది. మరి మిగిలిన రోజుల్లో ఏ మేర వసూళ్లను అందుకుంటుందో చూడాలి.
Follow @TBO_Updates
Post a Comment