Subscribe Us

Sreekaram @ Pre-release Business Details


టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా రోజుల తరువాత ఒక బిగ్ ఫైట్ జరగబోతోంది. ఇక ఈ సమరంలో బిజినెస్ పరంగా పెద్ద సినిమా అయితే శర్వానంద్ శ్రీకారం. గురువారం రిలీజ్ కానున్న ఈ సినిమా వ్యవసాయం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది. ఈ ఫీల్ గుడ్ మూవీపై ఓ వర్గం ఆడియెన్స్ లో అంచనాలు గట్టిగానే ఉన్నాయి. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో కలెక్షన్స్ అందుకోవాడానికి రెడీ అవుతోంది.

చివరగా శర్వానంద్ సినిమాలు హ్యాట్రిక్ డిజాస్టర్స్ అయ్యాయి. మహానుభావుడు హిట్ తరువాత చేసిన పడి పడి లేచే మనసు, రణరంగం, జాను సినిమాలు ప్లాప్ అయిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు శతమానం భవతి స్టైల్ లో హిట్ కొట్టాలని శర్వానంద్ ప్రయత్నాలు బాగానే చేస్తున్నాడు. శ్రీకారం సినిమా తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 17కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం (నైజాం 5.75 కోట్లు, ఆంధ్ర 8 కోట్లు, సీడెడ్ 2.3 కోట్లు, ఇతరం ఒక కోటి).  మరి సినిమా ఏ స్థాయిలో వసూళ్లను అందుకుంటుందో చూడాలి.



Post a Comment

0 Comments