సౌత్ ఇండియాలోనే బిగెస్ట్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న హీరోలలో రజనీకాంత్ ఒకరు. ఆయన సినిమా రాబోతోంది అంటే ఒకప్పుడు లోకల్ హీరోలు కూడా వారి సినిమాలను వాయిదా వేసుకువేవారు. అంతలా సూపర్ స్టార్ వండర్స్ క్రియేట్ చేసేవారు. అయితే కోలీవుడ్ ఇండస్ట్రీలో మొదటిసారి దళపతి విజయ్ తలైవా సినిమాకు పోటీగా నిలవబోతున్నాడు.
రజనీకాంత్ ప్రస్తుతం శివ దర్శకత్వంలో అన్నత్తే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాను ఎలాగైనా దీపావళికి విడుదల చేసి హిట్టు కొట్టాలని ప్లాన్ చేస్తుండగా అదే సమయంలో విజయ్ కూడా తన 65వ సినిమాను రాబోయే దీపావళికి రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నట్లు టాక్ బలంగా వినిపిస్తోంది. నెల్సన్ దిలీప్ కుమార్ ఆ సినిమాను డైరెక్ట్ చేయనున్నాడు. ఈ మధ్య కాలంలో రజనీకాంత్ సినిమాలకంటే కూడా విజయ్ సినిమాలే ఎక్కువగా బాక్సాఫీస్ కలెక్షన్స్ అందుకుంటున్నాయి. మరి దీపావళి ఫైట్ లో ఈ ఇద్దరిలో ఎవరు బాక్సాఫీస్ వద్ద అత్యదిక వసూళ్లను అందుకుంటారో చూడాలి.
Follow @TBO_Updates
Post a Comment