టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా సినిమా కథలను సెలెక్ట్ చేసుకోవడంలో స్పీడ్ పెంచాడు. RRR కంటే ముందే ఆచార్య సినిమాతో సందడి చేయనున్న రామ్ చరణ్ ఉగాది సందర్భంగా ఒక స్పెషల్ అప్డేట్ ఇవ్వబోతున్నట్లు టాక్ వస్తోంది. చెర్రీ తన 16వ సినిమాపై కూడా ఇటీవల ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
శంకర్ తో 15వ సినిమాను ఫిక్స్ చేసుకున్న విషయం తెలిసిందే. ఇక 16వ సినిమాను జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరితో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది మొదటి నుంచి కాంబినేషన్ పై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గానే స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్లు టాక్ వస్తోంది. ఇక ఉగాది సందర్భంగా ప్రాజెక్ట్ పై అఫీషియల్ గా క్లారిటీ ఇవ్వనున్నట్లు సమాచారం.
Follow @TBO_Updates
Post a Comment