సంచలన దర్శకుడు శంకర్ మరో బిగ్ పాన్ ఇండియా సినిమాకు శ్రీకారం చుట్టబోతున్నాడు. ఆయన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సినిమాల్లో అపరిచితుడు ఒకటి. విక్రమ్ తో చేసిన ఆ సినిమా టాలీవుడ్ కూడా సంచలన విజయాన్ని అందుకుంది. అయితే అదే కాన్సెప్ట్ తో మరో అపరిచితుడు కథను పాన్ ఇండియా సినిమాగా తీసుకురాబోతున్నారు.
మొత్తానికి కాంబినేషన్ పై అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చేశారు. హీరోగా రణ్ వీర్ సింగ్ నటించబోతున్నాడు. ఇక పెన్ స్టూడియోస్ పై జయంతిలాల్ ఈ బిగ్ బడ్జెట్ సినిమాను ప్రొడ్యూస్ చేయబోతున్నారు. ఇక సినిమాను 2022 సమ్మర్ లోనే స్టార్ట్ చేయవచ్చని సమాచారం. అయితే ఇండియన్ 2కు ఫీనిషింగ్ టచ్ ఇస్తున్న శంకర్ రామ్ చరణ్ తో కూడా ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది మిడ్ లో అపరిచితుడు స్టార్ట్ అంటే రామ్ చరణ్ సినిమాను ఎప్పుడు స్టార్ట్ చేస్తారో..?
Follow @TBO_Updates
Post a Comment