NTR - Trivikram.. What is the Issue?


టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేయడానికి ఎలాంటి హీరో అయినా సరే రెడీగా ఉంటారు. కొన్ని అపజయాలు ఉన్నప్పటికీ ఆయన మీద నమ్మకంతో కథ వినకుండా సినిమాలు చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే ఇటీవల ఎన్టీఆర్ సడన్ గా తప్పుకొని కొరటాల శివను సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏమిటనేది హాట్ టాపిక్ గా మారింది.

అసలు విషయం ఏంటంటే.. RRR లాంటి సినిమా అనంతరం ఆ స్థాయిలో కాకపోయినా మినిమమ్ హై వోల్టేజ్ యాక్షన్ సినిమా చేయాలని ఎన్టీఆర్ ప్లాన్ వేశాడు. అందులో భాగంగానే త్రివిక్రమ్ చెప్పిన ఫ్యామిలీ డ్రామాను పక్కన పెట్టేశాడు. ఇద్దరు ఫ్రెండ్లిగా మాట్లాడుకునే ప్రాజెక్టు క్యాన్సిల్ చేశారట. తప్పకుండా భవిష్యత్తులో మరోసారి సినిమా చేయాలని కూడా డీల్ సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ రూమర్ పై చిన్న క్లారిటీ ఇవ్వకపోవడంతో ఎన్నో అనుమానాలు వస్తున్నాయి. ఇక కొరటాల శివతో 30వ సినిమాను పాన్ ఇండియా సినిమాగానే ప్లాన్ చేస్తున్నరు.


Post a Comment

Previous Post Next Post