బ్రహ్మోత్సవం పాఠాన్ని పక్కన పెట్టేసిన మహేష్?


జూనియర్ ఎన్టీఆర్ తో ప్రాజెక్టు క్యాన్సిల్ అవ్వడంతో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మరో స్టార్ హీరోను లైన్ లో పెట్టేశాడు. మహేష్ బాబుతో మూడవసారి వర్క్ చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. మొత్తానికి అనుకున్నట్లుగానే ఎన్టీఆర్ తన 30వ సినిమాకు కొరటాల శివను ఫిక్స్ చేసుకున్న విషయం తెలిసిందే. ఇక త్రివిక్రమ్ కూడా ఖాళీగా ఉండకుండా స్టార్ హీరోనే పట్టేశాడు.

త్రివిక్రమ్ , మహేష్ బాబు కాంబినేషన్ ఎప్పటి నుంచో చర్చల్లో ఉంది. అతడు, ఖలేజా సినిమా తరువాత వీరి కలయిక కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక మహేష్ కూడా త్రివిక్రమ్ చెప్పిన ఒక పాయింట్ కు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చాడని తెలుస్తోంది. ఇక ఫైనల్ స్క్రిప్ట్ పూర్తి కాకపోయినా మెయిన్ స్క్రీన్ ప్లే రెడీ చేసుకున్నట్లు సమాచారం. ఇక మహేష్ బ్రహ్మోత్సవం తరువాత ఫుల్ స్క్రిప్ట్ రెడీ అయ్యే వరకు ఎవ్వరికీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. కానీ చాలా రోజుల తరువాత త్రివిక్రమ్ కు ఓకే చెప్పినట్లు సమాచారం. త్వరలోనే స్పెషల్ అప్డేట్ రానున్నట్లు టాక్ వస్తోంది.


Post a Comment

Previous Post Next Post