మెగా హీరోతో సుకుమార్ శిష్యుడు!!


క్రియేటివ్ డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న సుకుమార్ ఉప్పెన సినిమాతో ఇటీవల తన శిష్యుడిని దర్శకుడిగా పరిచయం చేసిన విషయం తెలిసిందే. ఉప్పెన సినిమాతో బుచ్చిబాబు హిట్ అందుకోవడంతో అదే తరహాలో మరి కొంతమందిని లైన్ లో పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇద్దరు దర్శకులతో రెండు సినిమాను లైన్ లో పెట్టాడు.

కార్తిక్ అనే దర్శకుడు సాయి ధరమ్ తేజ్ తో బ్లాక్ మ్యాజిక్ బ్యాక్ డ్రాప్ లో ఒక సినిమా చేస్తున్నాడు. అతను కూడా సుకుమార్ శిష్యుడే. ఇక మరొక కొత్త శిష్యుడు కూడా మెగా హీరోకు కొత్త కథను వినిపించినట్లు తెలుస్తోంది. అతని పేరు జయంత్. ఇటీవల స్క్రిప్ట్ పై చర్చలు జరిపిన సాయి త్వరలోనే ఈ దర్శకుడి సినిమాపై అఫీషియల్ అప్డేట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మరి జయంత్ బుచ్చిబాబు రేంజ్ లో హిట్టు కొడతాడో లేదో చూడాలి.


Post a Comment

Previous Post Next Post