Pushpa: Surprise for Allu Arjun fans!


అల్లు అర్జున్ మొదటి పాన్ ఇండియా మూవీ పుష్ప షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. రిలీజ్ డేట్ మళ్ళీ మారే అవకాశం ఉన్నట్లు రూమర్స్ అయితే బాగానే వస్తున్నాయి. ఇంతవరకు ఆ రూమర్స్ పై అయితే క్లారిటీ ఇవ్వలేదు. ఇక సుకుమార్ గ్యాంగ్ అయితే ఒక సర్ ప్రైజ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు కావడంతో ఒక రోజు ముందే ఫస్ట్ గ్లింప్స్ ను ప్లాన్ చేసినట్లు సమాచారం.

మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఏప్రిల్ 7న గ్లింప్స్ లేదా టీజర్ ను విడుదల కోసం ఒక గ్రాండ్ ఈవెంట్ ను ప్లాన్ చేసినట్లు సమాచారం. త్వరలోనే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రానున్నట్లు తెలుస్తోంది. పుష్ప సినిమాపై కేవలం తెలుగులోనే కాకుండా నార్త్ లో కూడా భారీ స్థాయిలో ప్రమోట్ చేయాలని చూస్తున్నారు. ఇక సినిమాను ఆగస్ట్ 13న విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే. సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇక రష్మీక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.


Post a Comment

Previous Post Next Post