'Wild Dog' Movie @ Review


కింగ్ నాగార్జున ప్రయోగాలు చేయడంలో ముందుంటాడని కథల ఎంపికతోనే అర్ధమవుతుంది. ఇక చాలా కాలం తరువాత వైల్డ్ డాగ్ అనే సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. NIA ఇన్వెస్టిగేషన్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ సినిమాలో రియల్ ఇన్సిడెంట్స్ ను ఎక్కువగా చుపించినట్లు చిత్ర యూనిట్ ముందు నుంచి ప్రమోట్ చేస్తూనే ఉంది. ఇక నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం..


కథ:

దేశంలో వరుసగా టెర్రరిస్ట్ ఎటాక్ లు జరుగుతుంటాయి. ఘటనలకు సంబంధించిన ఉగ్ర వాదులను పట్టుకోవడానికి వైల్డ్ డాగ్ విజయ్ వర్మ(నాగర్జున) రంగంలోకి దిగుతాడు. స్పెషల్ NIA టీమ్ తో ఒక బేకరీ బ్లాస్ట్ నుంచి మొదలయ్యే ఇన్వెస్టిగేషన్ అనేక రకాల మలుపులు తిరుగుతుంది. ఖలీద్ అనే టెర్రరిస్ట్ ను పట్టుకోవడానికి వెళ్లిన అనంతరం నాగార్జున ఆపరేషన్ సడన్ గా ఫెయిల్ అవుతుంది. ఇక నేపాల్ లో అతి భయంకర ఉగ్ర ముఠా ఉన్నట్లు కనుగొంటారు. అప్పుడే నాగ్ సస్పెండ్ అవ్వడంతో ఇంటర్వెల్ ట్వీస్ట్ క్రియేట్ అవుతుంది. ఆ తరువాత నాగ్ టీమ్ ఉగ్రవాదులను ఎలా టార్గెట్ చేసింది? అసలు ఉగ్రవాదుల నుంచి NIA టీమ్ కు ఎదురయ్యే సవాళ్లు ఏమిటి అనే విషయాలు తెలియాలి అంటే పూర్తి సినిమా చూడాల్సిందే..

ఫస్ట్ హాఫ్:
కథకు అసలైన బలాన్ని కలిగించాడనికి దర్శకుడు ఫస్ట్ హాఫ్ లో బ్లాస్ట్ కు సంబంధించిన సీన్స్ తో పాటు నాగార్జునతో NIA టీమ్ ను బాగా హైలెట్ చేశాడు. పాత్రల పరిచాయలతో ప్రేక్షకులను కథలోకి తీసుకు వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే అక్కడక్కడా కొన్ని సీన్స్ ఇంతకుముందు చూసిన ఇన్వెస్టిగేషన్ సినిమాల్లో ఉన్నట్లుగానే ఉంటాయి. వైల్డ్ డాగ్ టీమ్ యాక్షన్ ఎంట్రీ సూపర్బ్ అనే చెప్పాలి. ఇక ఇంటర్వెల్ లో నాగార్జున పాత్ర నుంచే ట్విస్టు క్రియేట్ చేసి సెకండ్ హాఫ్ పై అంచనాలను పెంచేశారు. 

సెకండ్ హాఫ్:
ఇన్వెస్టిగేషన్ ను అనుకోని విధంగా కొనసాగించే సన్నివేశాలు కథకు బలాన్ని ఇచ్చాయి. నాగార్జున ఒక్కడే లీడ్ చేసిన సీన్స్ అద్భుతంగా ఉన్నాయి. నేపాల్ యాక్షన్ సీన్స్ కూడా కొత్తగా ఉన్నాయి. రియాలిటీ తగ్గట్లుగా హీరో వైఫల్యాలను కూడా పర్ఫెక్ట్ గా ప్రజెంట్ చేశారు. ఇక ఫైనల్ గా క్లైమాక్స్ లో ఉగ్రవాదులను పట్టుకునే సీన్స్ బాగానే ఉన్నా ఓ వర్గం ఆడియెన్స్ ను అంతగా ఆకట్టుకోకపోవచ్చు. చివరలో పెద్దగా హడావుడి లేకుండా థ్రిల్లింగ్ సన్నివేశాలతో కథకు ముగింపు పలికారు.

ఫైనల్ గా:
అయితే ప్రేక్షకులకు ఆసక్తి కలిగించాడనికి దర్శకుడు హీరోయిజంలో వైఫల్యాలను కూడా అద్భుతంగా ప్రజెంట్ చేస్తాడు. వైల్డ్ డాగ్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ కు థమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరో లెవెల్ కు తీసుకెళ్లింది. ఇక కెమెరామెన్ పనితనంకు ఫిదా అవ్వాల్సింది. మిగతా నటీనటులు వారి బారి పాత్రలకు పరవాలేదు అనిపించేలా న్యాయం చేశారు. ఇక నాగార్జున పెర్ఫామెన్స్ మాత్రం కొత్త అనుభూతిని కలిగిస్తుంది. దర్శకుడు ఆశిషోర్ సోలమన్ మేకింగ్ రియాలిటీకి కొంత దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తుంది. అయితే యాక్షన్ సీన్స్ ఇంకాస్త హై వోల్టేజ్ తో ఉంటే బావుండేది. టెర్రరిస్ట్ లకు సంబంధించిన సీన్స్ కూడా హై వోల్టేజ్ తో తెరకెక్కించారు. మొత్తంగా ఫస్ట్ హాఫ్ కథపై అంచనాలను పెంచుతుంది. కానీ సెకంస్ హాఫ్ ఆ స్థాయిలో మెప్పించలేదు. కానీ ఓవరాల్ గా సినిమా నాగార్జున వన్ మ్యాన్ షోతో ఒకసారి హ్యాపీగా వీక్షించవచ్చు.

ప్లస్ పాయింట్స్:
నాగార్జున యాక్టింగ్ 
థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
బ్లాస్ట్ సీన్స్
కెమెరా వర్క్

మైనస్ పాయింట్స్:
సెకండ్ హాఫ్ సీన్స్
 క్లైమాక్స్

బాటమ్ లైన్: నాగార్జున వన్ మ్యాన్ షో

రేటింగ్: 3/5  

Post a Comment

Previous Post Next Post