Ek Mini Katha gets Huge Profits!!


ఏ ఇండస్ట్రీలో అయినా సరే సినిమా కంటెంట్ క్లిక్కయితే ఒక చోట నష్టపోయినా మరొక చోట లాభాలు వచ్చే రోజులివి. ఒకప్పుడు కేవలం థియేట్రికల్ మార్కెట్ పైనే నమ్మకం పెట్టుకునే వారు. కానీ నాన్ థియేట్రికల్ గా వచ్చే డిజిటల్ బిజినెస్ కూడా చాలా కీలకంగా మారింది. ఆల్ మోస్ట్ ఆ రూట్లోనే పెట్టిన పెట్టుబడి మొత్తం వచ్చేస్తున్నాయి.

ఏక్ మినీ కథ కూడా అదే తరహాలో ప్రాఫిట్స్ అందుకుంటోంది. ఈ సినిమాలోని హీరో ప్రయివేట్ పార్ట్ చిన్నదిగా ఉండే సమస్యతో బాధపడుతుంటాడు. సంతోష్ శోభన్ హీరోగా నటించగా దర్శకుడు మెర్లపాక గాంధీ కథను అందించాడు.  ఈ సినిమాకు కార్తిక్ దర్శకత్వం వహించాడు. ఇక యూవీ క్రియేషన్స్ నుంచి వచ్చిన యూవీ కాన్సెప్ట్స్ లోనే ఈ సినిమాను 4 31కోట్ల బడ్జెట్ తో రూపొందించారు. ఇక అమెజాన్ ప్రైమ్ ఓటీటీ హక్కులను 9.32కోట్లకు అందుకోగా శాటిలైట్ ద్వారా 3.86కోట్లు వచ్చాయి. మొత్తంగా పెట్టిన బడ్జెట్ పోను 8.87కోట్లు వచ్చాయి. నిజానికి ఈ కరోనా టైమ్ లో థియేట్రికల్ గా రిలీజ్ చేస్తే ఈ రేంజ్ లో ప్రాఫిట్స్ వచ్చేవి కావు.


Post a Comment

Previous Post Next Post