టాలీవుడ్ మార్కెట్ పై కోలీవుడ్ స్టార్ విజయ్ స్పెషల్ ఫోకస్ పెట్టాడు. తుపాకీ సినిమా నుంచి తెలుగులో అతనికి రెస్పాన్స్ గట్టిగానే వస్తోంది. సర్కార్, మెర్షల్, వంటి సినిమాలు కూడా సాలీడ్ వసూళ్లను అందుకున్నాయి. ఇక ఈ ఎడాది వచ్చిన మాస్టర్ సినిమాతో కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ అందుకోవడంతో విజయ్ కు ఒక కాన్ఫిడెన్స్ వచ్చేసింది.
అందుకే డైరెక్ట్ గా తెలుగు - తమిళ్ బైలాంగ్యువల్ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఆ సినిమాకు తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించనున్నాడు. ఇక నిర్మాత దిల్ రాజు అని అందరికి తెలిసిన విషయమే. 67వ సినిమాగా రాబోయే ఆ సినిమాను ఇదే ఏడాది ఒక స్పెషల్ డేట్ కు ఎనౌన్స్ చేయనున్నారు. విజయ్ పుట్టినరోజు సందర్భంగా జులై 22న ప్రాజెక్ట్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం 65వ సినిమాని నెల్సన్ దిలీప్ కుమార్ తో చేస్తున్న విజయ్ 66వ సినిమాను లోకేషన్ కనగరాజ్ దర్శకత్వంలో చేయనున్నాడు.
Follow @TBO_Updates
Post a Comment