Subscribe Us

Gopichand-Rajashekar Multi-Starrer movie on Cards!


మల్టీస్టారర్ సినిమాలకు రోజురోజుకు డిమాండ్ ఎక్కువవుతోంది. ఒకప్పటి లాగా హీరోలు స్టార్ డమ్ ను దృష్టిలో ఉంచుకొని కథలను ఓకే చేయడం లేదనే చెప్పాలి. పాత్ర పవర్ఫుల్ గా ఉంటే నెగిటివ్ రోల్ అయినా సరే చేసేస్తున్నారు. ఇక చాలా రోజుల తరువాత ఒక డిఫరెంట్ మల్టీస్టారర్ సెట్స్ పైకి వచ్చే ఛాన్స్ ఉన్నట్లు టాక్ వస్తోంది.

గోపీచంద్ - రాజశేఖర్ కాంబినేషన్ లో హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాను రూపొందించే అవకాశం ఉన్నట్లు రూమర్స్ వస్తున్నాయి. లక్ష్యం - లౌక్యం వంటి సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న దర్శకుడు శ్రీవాస్ ఈ మల్టీస్టారర్ సినిమాను తెరకెక్కించే అవకాశం ఉందట. ప్రస్తుతం గోపిచంద్ సీటిమార్ సినిమా విడుదలకు సిద్దంగా ఉన్న విషయం తెలిసిందే. ఇక రాజశేఖర్ కూడా మరో రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. సమ్మర్ అనంతరం ఈ మల్టీస్టారర్ స్టార్ట్ కానుందని సమాచారం.


Post a Comment

0 Comments