మహేష్-త్రివిక్రమ్ సినిమాలో.. మహేష్ క్లోజ్ ఫ్రెండ్?


టాలీవుడ్ లో సినిమా ఇండస్ట్రీలో బాక్సాఫీస్ వద్ద పోటీ ఎంత ఉన్నా కూడా హీరోల మధ్య పర్సనల్ గా ఫ్రెండ్షిప్ చాలానే ఉంటుంది. బయటకు కనిపించరు గాని ఎక్కడైనా కలుసుకుంటే మాత్రం కొందరు హీరోలు చాలా స్నేహంగా మాట్లాడుకుంటారు. ఇక బిగ్ స్క్రీన్ పై కలిసి నటించడానికి ఈ మధ్య హీరోలు బేధాలు చూడటం లేదు. 

రాబోయే మహేష్ సినిమాలో మరొక హీరో నటిస్తున్నట్లు టాక్. త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న మహేష్ న్యూ మూవీ త్వరలోనే స్టార్ట్ కానున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో అక్కినేని హీరో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఆ హీరో మరెవరో కాదు. ఒకప్పుడు మహేష్ బాబుతో చాలా సన్నిహితంగా ఉన్న సుమంత్.

ఇప్పుడు కలుసుకుంటున్నారో లేదో తెలియదు గాని కెరీర్ మొదట్లో మాత్రం ఒకరినొకరు విడిచేవారు కాదు. బిజీబిజీ లైఫ్ వల్ల గ్యాప్ రావడంతో దూరంగా ఉంటున్న ఈ ఇద్దరు మొత్తానికి ఇలా త్రివిక్రమ్ సినిమా ద్వారా స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్లు టాక్. మరి ఈ రూమర్ ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు అగాల్సిందే.

Post a Comment

Previous Post Next Post