రాధేశ్యామ్ కోసం టైటానిక్ తెస్తున్నారా ఏంటి?రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలపై పెరుగుతున్న అంచనాలు ఇప్పట్లో తగ్గేలా లేవు. దానికి తోడు గాసిప్స్ డోస్ కూడా పెరిగుతున్నాయి. గతంలో ఎప్పుడు లేని విధంగా రాధేశ్యామ్ పై వస్తున్న సరికొత్త ఊహాగానాలు సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేస్తున్నాయి. సినిమాలో ట్రైన్ సీన్స్ తో పాటు భారీ షిప్ సీన్స్ కూడా హైలెట్ అయ్యేలా ఉంటాయట.

సినిమాలో టైటానిక్ లాంటి ఒక పెద్ద ఓడను గ్రాఫిక్స్ ద్వారా డిజైన్ చేశారట. ఇక అందులో ప్రేమ సన్నివేశాలతో పాటు మరికొన్ని యాక్షన్ సీన్స్ ఉంటాయని తెలుస్తోంది. దీంతో మరొక టైటానిక్ లాంటీ సీన్స్ ఏమైనా షూట్ చేసారా అనే కామెంట్స్ వస్తున్నాయి. సినిమా మాత్రం నెవర్ బిఫోర్ అనేలా ఉంటుందని యాక్షన్ పార్ట్ ఎక్కువగా ఉండకపోయినా కూడా రొమాంటిక్ లవ్ సీన్స్ మాత్రం ప్రతి ఒక్కరి మనసును టచ్ చేస్తాయని సమాచారం. ఇక సినిమాను జులై 30న విడుదల చేయాలని డేట్ ఫిక్స్ చేసుకున్న విషయం తెలిసిందే.


Post a Comment

Previous Post Next Post