NTR 31 కోసం ప్రశాంత్ నీల్ పవర్ఫుల్ రెమ్యునరేషన్!


టాలీవుడ్ లో వరుసగా పాన్ ఇండియా సినిమాలు రెడీ అవుతున్న విషయం తెలిసిందే. గ్యాప్ లేకుండా అగ్ర దర్శకులు ఒక సినిమా సెట్స్ పై ఉండగానే మరొక సినిమాను రెడీ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఎవరెవరు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు అనేది కూడా హాట్ టాపిక్ గా మారింది. KGF దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా పవర్ఫుల్ రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం.

సలార్ అనంతరం ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్ 31వ ప్రాజెక్టును డైరెక్ట్ చేయబోతున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఆ సినిమా కోసం ప్రశాంత్ 10కోట్లకు పైగా రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం. KGF 2, సలార్ సినిమాల కంటే ముందుగానే సినిమా డీల్స్ ఫిక్స్ చేసుకున్న విషయం తెలిసిందే. ఒకవేళ ఆ సినిమాల అనంతరం వచ్చి ఉంటే ఈ దర్శకుడి రేటు మరోలా ఉండేది. కొరటాల శివ మూవీ అనంతరం ఎన్టీఆర్ ఈ ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకురానున్నాడు.


Post a Comment

Previous Post Next Post