Subscribe Us

NTR clarifies his Next Pan Indian Projects!


జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల కరోనా బారిన పడడంతో RRR షూటింగ్ ఇప్పట్లో మళ్ళీ స్టార్ట్ అయ్యే ఛాన్స్ లేదని ఒక క్లారిటీ వచ్చేసింది. కరోనా సెకండ్ వేవ్ పెరగడంతోనే రాజమౌళి టీమ్ షూటింగ్ ను ఆపేసింది. ఇంకా కేవలం 40రోజులైతే మొత్తం షూటింగ్ అయిపోతుందని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తారక్ వివరణ ఇచ్చారు.

RRR సినిమాతో పాటు తన భవిష్యత్తు ప్రాజెక్టులపై కూడా వివరణ ఇచ్చాడు. కొరటాల శివ సినిమాతో పాటు ఆ తరువాత ప్రశాంత్ నీల్ తో సినిమా ఉంటుందని చెప్పేశాడు. తారక్ ఆ రెండు సినిమాలపై మాత్రమే క్లారిటీ ఇవ్వడంతో మరో రెండు ఇంకా ఫైనల్ కాలేదని అర్ధమవుతోంది. అట్లీ దర్శకత్వంలో అలాగే ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబుతో కూడా చర్చలు జరిగాయి. కానీ తారక్ ఇంకా వాటిపై తుది నిర్ణయం తీసుకోలేదని ఈ వివరణతో అభిమానులకు ఒక క్లారిటీ వచ్చేసింది.


Post a Comment

0 Comments