Pushpa Part1 almost completed!


RRR తరువాత బిగ్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సీనిమాల్లో పుష్ప ఒకటి. బడ్జెట్ లెక్కలతో పాటు సినిమాకు సంబంధించిన ప్లాన్స్ కూడా మొత్తం మారిపోతున్నాయి. KGF , బాహుబలి తరహాలోనే రెండే భాగాలుగా రిలీజ్ చేయాలని గట్టి ప్లానే వేశారు. దర్శకుడు సుకుమార్ ఎలా ప్లాన్ చేస్తున్నాడో తెలియదు గాని ఫస్ట్ పార్ట్ షూటింగ్ పూర్తయినట్లు నిర్మాత కూడా క్లారిటీ ఇచ్చేశాడు.

పుష్ప రెండు భాగాలుగా రూపొందుతున్నట్లు చెప్పిన మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవి శంకర్ ఫస్ట్ పార్ట్ కు సంబంధించిన ఒక సాంగ్ తో పాటు కేవలం కొన్ని సీన్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయట. ఆ పనులు అయిపోతే ఫస్ట్ పార్ట్ షూటింగ్ మొత్తం అయిపోయినట్లే. ఇక పుష్ప 2కోసం కథలో డోస్ ను ఇంకాస్త ఎక్కువగా పెంచుతున్నారట. అందులో కూడా ఒక స్పెషల్ సాంగ్ ను జత చేయబోతున్నట్లు సమాచారం. మరి సుకుమార్ పాన్ ఇండియా ప్లాన్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.


Post a Comment

Previous Post Next Post