టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కథను ఎంత బలంగా రాసుకుంటారో అలాగే మాటలు కూడా అంతే పదునుగా ఉండాలని ఆలోచిస్తారు. ఆయన తలచుకుంటే బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాని స్థాయిలో హిట్ కొట్టగలరని చాలా మంది చెబుతుంటారు. కానీ త్రివిక్రమ్ ఇంతవరకు తెలుగు తప్పితే మరో భాషలోకి వెళ్లలేదు.
అయితే మొదటిసారి మాటల మాంత్రికుడు పాన్ ఇండియా రేంజ్ ను టచ్ చేయబోతున్నట్లు టాక్ వస్తోంది. మహేష్ బాబుతో చేయబోయే న్యూ మూవీని అన్ని ప్రధాన భాషల్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇదివరకే స్పైడర్ సినిమాతో అలాంటి ప్రయోగమే చేసిన మహేష్ ఫుల్ పాన్ ఇండియా ప్రాజెక్టును టచ్ చేసింది లేదు. రాజమౌళితో చేసే ముందే త్రివిక్రమ్ తో చేసే సినిమాను దేశవ్యాప్తంగా రిలీజ్ చేయాలని ప్లాన్ వేశారు. మరి ఆ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.
Follow @TBO_Updates
Post a Comment