టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా క్రేజ్ అందుకుంటున్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల హాలీవుడ్ సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసినట్లు రూమర్స్ రాగా చివరికి ఆ దర్శకుడే అఫీషియల్ గా క్లారిటీ ఇవ్వడంతో అందరూ షాక్ అయ్యారు. మిషన్: ఇంపాజిబుల్ 7లో టామ్ క్రూజ్ తో రెబల్ స్టార్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్లు టాక్ రావడంతో అభిమానులు నిజమని సంతోషించారు.
ఇక దర్శకుడు క్రిస్టోఫర్ మెక్‌క్వారీ అందులో నిజం లేదు అనడంతో ప్రభాస్ అభిమానులు కొంత నిరాశ చెందారు. కానీ అలా బాధపడాల్సిన అవసరమే లేదు. మన డార్లింగ్ తో నాగ్ అశ్విన్ చేస్తున్న సినిమా నెవర్ బిఫోర్ అనేలా ఇంటర్నేషనల్ లెవెల్లో రాబోతోంది. హాలీవుడ్ లో రిలీజ్ చేస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు. ఆ సినిమాతో నాగ్ అశ్విన్ కచ్చితంగా మ్యాజిక్ క్రియేట్ చేయగలడని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు బాలీవుడ్ తరహాలోనే హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా ప్రభాస్ డేట్స్ కోసం ఎగబడటం కాయమని చెప్పవచ్చు. లేట్ అవ్వచ్చు గాని.. హాలీవుడ్ సినిమాతో ప్రభాస్ రావడం పక్కా!
Follow @TBO_Updates
Post a Comment