అల్లు అర్జున్.. మరో పాన్ ఇండియా మూవీ!


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో మొదటిసారి పాన్ ఇండియా బిజినెస్ ను టచ్ చేయబోతున్న విషయం తెలిసిందే. సినిమా ఎంతవరకు సక్సెస్ అవుతుందో తెలియదు గాని బన్నీ మాత్రం భవిష్యత్తు ప్రాజెక్టులను కూడా అదే రేంజ్ లో ప్లాన్ చేసుకుంటున్నాడు. మొత్తానికి ఐకాన్ మూవీ కూడా పాన్ ఇండియా లిస్టులోనే చేరినట్లు తెలుస్తోంది.

మొదట ఈ సినిమాను కేవలం తెలుగులోనే విడుదల చేయాలని అనుకున్నారు. కానీ పింక్ కథను కమర్షియల్ ఎలిమెంట్స్ తో వకీల్ సాబ్ గా మార్చిన వేణు శ్రీరామ్ పనితనం బన్నీకి బాగా నచ్చిందట. అందుకే అతని మీద నమ్మకంతో ఐకాన్ స్క్రిప్టును పాన్ ఇండియా ప్రాజెక్టుగా మార్చమని సలహా ఇచ్చారట. నిర్మాత దిల్ రాజు కూడా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. బడ్జెట్ కూడా పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.


Post a Comment

Previous Post Next Post