మోక్షజ్ఞ ఎంట్రీ.. ఆ దర్శకులందరిని కాదని..!


నందమూరి అభిమానులు గత కొన్నేళ్లుగా మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం వారసుడి వయసు 26 ఏళ్లు. ఇదే సరైన సమయం అని బాలయ్యకు ఇప్పటికే చాలా విన్నపాలు వచ్చాయి. ఇక రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో అదిత్య 369 సీక్వెల్ తో రెడీ కానున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు.

మోక్షజ్ఞ ఎంట్రీ బాలయ్య దర్శకత్వంలోనే ఉంటుందని ఒక క్లారిటీ అయితే ఇచ్చేశారు. అయితే ఆ సినిమాను మొదట క్రిష్ తో అనుకున్నారట. కానీ ఆ దర్శకుడు అంతగా ఇంట్రెస్ట్ చూపలేదని సమాచారం. ఇక బోయపాటి శ్రీను మాస్ కమర్షియల్ కథ చెప్పగా బాలయ్య రిస్క్ చేయలేక డ్రాప్ అయ్యాడట. ఇక అనిల్ రావిపూడి కూడా సిద్ధంగా ఉన్నప్పటికీ బాలయ్య ఎందుకో ఎవరి మీద నమ్మకం ఉంచడం లేదు. కొడుకుపై ప్రేమతో అద్భుతంగా చూపించాలని తనే రంగంలోకి దిగుతున్నాడు. మరి ఆ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.


Post a Comment

Previous Post Next Post