స్టైలిష్ స్టార్, ఐకాన్ స్టార్ ట్యాగ్స్ తో నిత్యం సోషల్ మీడియాలో భారీ క్రేజ్ అందుకుంటున్న అల్లు అర్జున్ పుష్ప సినిమాతో నెవర్ బిఫోర్ అనేలా కిక్కు ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఊర మాస్ యాక్షన్ సీన్స్ తో పాటు పదునైన డైలాగ్స్ తో కూడా వెండితెరను హీటెక్కించనున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా డ్యాన్స్ తో కూడా ఇరగదీయడం పక్కా అని చెప్పవచ్చు.
ఇక అభిమానులను ప్రస్తుతం ఒక టాక్ మరింత ఊరిస్తోంది. పుష్ప సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో కలిసి బన్నీ స్టెప్పులు వేయబోతున్నట్లు సమాచారం. గతంలో మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో మెగా హీరోలు సాంగ్స్ మధ్యలో వచ్చి కిక్కిచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు బన్నీ సినిమాలో చిరంజీవి స్పెషల్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. మరి ఇది ఎంతవరకు నిజమనే విషయంలో ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ విషయం వైరల్ అవ్వకముందే క్లారిటీ ఇస్తే బెటర్. సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న పుష్ప రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Follow @TBO_Updates
Post a Comment