మహేష్ బాబు - ప్రశాంత్ నీల్.. ఎందుకు సెట్టవ్వలేదు?


టాలీవుడ్ ఇండస్ట్రీలో గతంలో ఎప్పుడు లేనంత భారీ కాంబినేషన్స్ సెట్టవుతున్నాయి. స్టార్ హీరోలు ఏ మాత్రం రెస్ట్ లేకుండా భవిష్యత్తు ప్రాజెక్టులను ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక ఇటీవల మహేష్ బాబు - ప్రశాంత్ నీల్ కాంబినేషన్ పై ఒక న్యూస్ అయితే వైరల్ అయ్యింది. ఆల్ మోస్ట్ సెట్ అయ్యిందిని అన్నట్లు కూడా కథనాలు వెలువడ్డాయి.

అయితే నిజానికి మహేష్ మెయిన్ స్టోరీ లైన్ మాత్రమే విన్నాడట. స్క్రిప్ట్ డిజైన్ చేసే విధానంపై కూడా ప్రశాంత్ ముందుగానే మహేష్ కు వివరణ ఇచ్చాడట. అయితే ఆ స్టోరీ మహేష్ బాబుకి అంతగా నచ్చకపోవడంతో రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. కుదరదని చెప్పినప్పటికీ ప్రశాంత్ కు మరొక కథ ఉంటే చెప్పమని మహేష్ సలహా కూడా ఇచ్చాడట. తప్పకుండా భవిష్యత్తులో సినిమా చేద్దామని కూడా అన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ వీరి కాంబినేషన్ సెట్టయితే గనక మహేష్ - రాజమౌళి సినిమా తరువాతే ఉంటుంది. మహేష్ నెక్స్ట్ సర్కారు వారి పాట, త్రివిక్రమ్ సినిమాలతో రాబోతున్న విషయం తెలిసిందే.


Post a Comment

Previous Post Next Post