9 ఏళ్ల తరువాత ఆరడుగుల బుల్లెట్..!


గోపిచంద్ నయనతార జంటగా నటించిన ఆరడుగుల బుల్లెట్ సినిమా గత 9 ఏళ్ల క్రితం 2012లో సెట్స్ పైకి వచ్చింది. ఇక సినిమా అప్పటి నుంచి కూడా అనేక సమస్యలు ఎదుర్కొంటు విడుదలకు నోచుకోక అష్టకష్టాలు పడుతొంది. ఇక ఫైనల్ గా నిర్మాత తాండ్ర రమేష్ ఇప్పుడు రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. 

ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు అప్పట్లో ఒక రేంజ్ లో బజ్ క్రియేట్ చేసింది. మొదట తమిళ దర్శకుడు భూపతి పాండియన్ దర్శకత్వంలో జగన్ మోహన్ ఐపీఎస్ టైటిల్ తో ప్రొడక్షన్ ను స్టార్ట్ చేయగా మళ్ళీ సడన్ గా ఎందుకో ఆయన డ్రాప్ అయ్యారు. ఇక దర్శకుడు బి.గోపాల్ రంగంలోకి దిగి ఎలాగోలా ఆర్థిక సమస్యల నడుమ ఆ సినిమాను పూర్తి చేశారు. కానీ అప్పులిచ్చిన ఫైనాన్షియర్స్ డబ్బులు ఇస్తే గాని సినిమాను విడుదల చేయనివ్వం అంటూ సినిమా రిలీజ్ ను గత ఏడేళ్ళుగా అడ్డుకుంటూనే వస్తున్నారు. గత ఏడాది డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అనుకున్నప్పటికి వర్కౌట్ కాలేదు. ఇక ఇప్పుడు థియేట్రికల్ గా రిలీజ్ చేయడానికి అన్ని సమస్యలు తొలగినట్లు సమాచారం.


Post a Comment

Previous Post Next Post