Vijay Beast: షాట్ గన్‌కు 8x స్కోప్.. అందులో తప్పేముంది!

 


కోలీవుడ్ తలపతి విజయ్ 65వ సినిమా ఫస్ట్ లుక్ టైటిల్ ని రిలీజ్ చేయగానే ప్రతి ఒక్కరు ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బీస్ట్ టైటిల్ అందరికి బాగానే నచ్చింది. కానీ కొందరు మాత్రం తెలిసి తెలియని తెలివితో విజయ్ పట్టుకున్న తుపాకీపై అనవసరంగా రచ్చ చేస్తున్నారు.


దీన్ని బట్టి పబ్ జి ప్రభావం గట్టిగానే ఉన్నట్లు అర్ధమయ్యింది. విజయ్ చేతిలో ఉన్న గన్ కు 8x స్కోప్ పెట్టడం ఏమిటని చాలామంది ఆశ్చర్యపోతున్నారు. నిజం ఏమిటంటే పబ్ జి గేమ్ లో లేని గన్స్ ఇంకా చాలా ఉన్నాయి. విజయ్ చేతిలో ఉన్నది Remington Model 870 షాట్ గన్. దానికి ఏ స్కోప్ అయినా కూడా సెట్ చేయవచ్చు. ఈ విషయం తెలియక నేషనల్ వైడ్ గా టాప్ మీమ్ పేజెస్ కూడా ట్రోల్స్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. దీంతో తలపతి అభిమానులు ఆధారాలతో సహా కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు.

Post a Comment

Previous Post Next Post