'బింబిసార' మూడు భాగాలు కాదు.. హిట్టయితేనే!


కళ్యాణ్ రామ్ కెరీర్ లో మొదటిసారి ఒక బిగ్ బడ్జెట్ సినిమా చేయడానికి సిద్దమైన విషయం తెలిసిందే. హిస్టారికల్ నేపథ్యంలో బింబిసార అనే కథను సెలెక్ట్ చేసుకోవడంతోనే మంచి బజ్ క్రియేట్ అయ్యింది. అయితే ఈ భారీ సినిమాను వశిష్ఠ అనే ఒక కొత్త దర్శకుడు  తెరకెక్కించడం ప్రయోగమనే చెప్పాలి.

ఇక సినిమాకు సంబంధించిన కథనాలు రోజుకోటి వైరల్ అవుతూనే ఉంది. సినిమాను మూడు భాగాలుగా తెరకెక్కిస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి. నిజానికి అసలు కథలో అయితే మూడు భాగాలు చేసే స్కోప్ ఉందట. అయితే కళ్యాణ్ రామ్ మార్కెట్ తో ఒకేసారి ఆ స్థాయిలో మూడు భాగాలను నిర్మించడం రిస్క్ తో కూడుకున్న పని. అందుకే మొదట ఒక పార్ట్ ను రిలీజ్ చేసి అప్పుడు హిట్టయితే సీక్వెల్స్ పై ఆలోచిస్తారట. అయితే దర్శకుడు ఆ కథను ఎలా సెట్ చేసుకుంటాడు అనేది చూడాలి.


Post a Comment

Previous Post Next Post