నిర్మాత సురేష్ బాబును టాలీవుడ్ బడా నిర్మాత అనడం కన్నా కూడా జీనియస్ ప్రొడ్యూసర్ అని చెప్పవచ్చు. ఎందుకంటే సినిమాను చూసిన వెంటనే అది ఎంత కలెక్ట్ చేయగలదో నలువైపులా లెక్కలు వేయగలరు. అలాంటి నిర్మాత ఇప్పుడు థియేటర్స్ మళ్ళీ ఎప్పటిలానే కొనసాగుతాయనే నమ్మకంతో లేనట్లు తెలుస్తోంది.
సురేష్ బాబు ఒక సినిమాను నిర్మిస్తే థియేట్రికల్ గా నాలుగు పైసలు టేబుల్ ప్రాఫిట్స్ వచ్చేలా ప్లాన్ చేసుకుంటారు. అలాంటి నిర్మాత నుంచి రాబోతున్న దృశ్యం 2, విరాటపర్వం సినిమాలు డైరెక్ట్ గా ఓటీటీలో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. నారప్ప కూడా ఓటీటీలో రావచ్చని అంటున్నారు గాని అందులో ఇంకా సరైన క్లారిటీ ఇవ్వలేదు. ఏదేమైనా అంతటి నమ్మకమైన నిర్మాత థియేటర్స్ పై ఆశలు వదులుకోవడం హాట్ టాపిక్ గా మారింది. భవిష్యత్తులో కూడా థియేట్రికల్ బిజినెస్ భారీగా తగ్గవచ్చని అనిపిస్తోంది.
Follow @TBO_Updates
Post a Comment