మరో ఆఫర్ అందుకున్న వైష్ణవ్ తేజ్ !


ఉప్పెన సినిమాతో పవర్ఫుల్ హిట్ అందుకున్న మెగా హీరో వైష్ణవ్ తేజ్ మళ్ళీ అదే తరహాలో సక్సెస్ అందుకోవాలని అడుగులు వేస్తున్నాడు. మొదటి సినిమా హిట్టవ్వడంతో ఆఫర్స్ చాలానే వస్తున్నాయట. అయితే కేవలం తనకు నచ్చిన కథలను మాత్రమే సెలెక్ట్ చేసుకుంటున్న వైష్ణవ్ ఎక్కువగా సక్సెస్ ఫుల్ వ్యక్తులనే టచ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే క్రిష్ దర్శకత్వంలో చేసిన ఒక సినిమాను విడుదలకు సిద్ధం చేయగా BVSN ప్రసాద్ ప్రొడక్షన్ లో కూడా ఒక సినిమాను స్టార్ట్ చేశారు. ఆ సినిమాను ఆదిత్య వర్మ దర్శకుడు గిరియశ తెరకెక్కిస్తున్నాడు. ఇక మజిలీ సినిమాతో బాక్సాఫీస్ హిట్ అందుకున్న షైన్ స్క్రీన్స్ తో కూడా ఒక సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఆ సినిమాకు ఒక యువ దర్శకుడిని సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే వైష్ణవ్ తో మైత్రి మూవీస్ మరో సినిమా చేయాలని ప్లాన్ చేసుకుంటోంది.


Post a Comment

Previous Post Next Post