నితిన్ నిజంగానే అమ్మేశాడా?


యువ హీరో నితిన్ పెళ్లి తరువాత స్పీడ్ పెంచినప్పటికి సక్సెస్ ట్రాక్ ను మాత్రం మరోసారి మిస్సయ్యాడు. ఛెక్, రంగ్ దే సినిమాలతో వరుసగా డిజాస్టర్స్ ఎదుర్కొన్న నితిన్ ఈసారి మాస్ట్రో సినిమాతో ఎలాగైనా మళ్ళీ ట్రాక్ లోకి రావాలని చూస్తున్నాడు. అందాదున్ సినిమాకు రీమేక్ గా వస్తున్న ఆ సినిమా షూటింగ్ అయితే పూర్తయ్యింది.

ఇక సినిమాను డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేయాలని ఆలోచిస్తున్నారట. నితిన్ సొంత బ్యానర్ లో రూపొందించిన ఈ సినిమాను మెర్లపాక గాంధీ దర్శకత్వం వహించాడు. ఇక ఇటీవల హాట్ స్టార్ ఫైనల్ గా 32కోట్లకు రిలీజ్ హక్కులను దక్కించుకున్నట్లు టాక్ అయితే వస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఒకవేళ డీల్ నిజమైతే ఆగస్ట్ లోనే హాట్ స్టార్ లో విడుదల చేయవచ్చని సమాచారం.


Post a Comment

Previous Post Next Post