మొన్న సన్నీలియోన్.. నేడు అనుపమ!


అనుపమ పరమేశ్వరన్ చాలా వరకు సైలెంట్ గా సినిమాలు చేసుకుంటూ వెళుతుంది. కాంట్రవర్సీలను ఏ మాత్రం టచ్ చేయదు. అయితే అనుకోకుండా ఆమె ఫొటో బీహార్ కు సంబంధించిన ఒక రిజల్ట్ మెమోలో దర్శనమివ్వడం హాట్ టాపిక్ గా మారింది.

బీహార్ విద్యా వ్యవస్థలో అవకతవకలు జరగడం కొత్తేమి కాదు. గతంలో సన్నీ లియోను పేరును వాడారు. గ్రాడ్యుయేషన్ చదువుతున్న ఒక విద్యార్థి పరీక్షకు అప్లై చేసిన దరఖాస్తులో తల్లి సన్నీలియోన్ తండ్రి ఇమ్రాన్ హష్మీ అని పేర్కొన్నారు. ఇక ఇప్పుడు బీహార్ STET పరీక్షల ఫలితాల అనంతరం రిషికేశ్ అనే యువకుడు మెమోను చూసుకోగా అందులో హీరోయిన్ అనుపమ ఫొటో దర్శనమిచ్చింది. దీంతో అతను ఆశ్చర్యపోయి ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది వైరల్ గా మారింది. ఇక అక్కడి వివిద్యావ్యవస్థ తీరు ఎంత దారుణంగా ఉందొ అర్థం చేసుకోవచ్చని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Post a Comment

Previous Post Next Post