మరోసారి రష్మీకతో నితిన్ రొమాన్స్!


యువ హీరో నితిన్ చివరగా భీష్మ సినిమాతో బాక్సాఫీస్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. అంతకుముందు వరకు వరుసగా హ్యాట్రిక్ డిజాస్టర్ ను చూసిన నితిన్ ఆ సినిమాతోనే మళ్ళీ తన పాత మార్కెట్ ను లైన్ లోకి తెచ్చుకున్నాడు. కానీ ఆ వెంటనే చెక్, రంగ్ దే సినిమాలతో మళ్ళీ డిజాస్టర్స్ చూడాల్సి వచ్చింది. 

ఇక ఇప్పుడు మాస్ట్రో సినిమాతో ఎలాగైనా హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. బాలీవుడ్ హిట్ మూవీ అందాదున్ కు రీమేక్ గా వస్తున్న ఆ సినిమాను మెర్లపాక గాంధీ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక వక్కంతం వంశీ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయబోతున్నాడు. ఆ సినిమాలో భీష్మ బ్యూటీ రష్మీక మందన్న నటించే అవకాశం ఉందట. నితిన్ రష్మీక పేరును సజెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. మరి రెండవసారి ఆ కాంబో ఎంతవరకు హిట్ అందుకుంటారో చూడాలి.


Post a Comment

Previous Post Next Post