RRR రావాలంటే.. అలా జరక్కూడదు!


టాలీవుడ్ ఇండస్ట్రీలో బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న RRR సినిమా కోసం అభిమానులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అక్టోబర్ 13న రావాల్సిన సినిమా మరోసారి వాయిదా పడే అవకాశం ఉంది. నేడు సినిమాకు సంబంధించిన ఒక అప్డేట్ ఇచ్చిన విషయం తెలిసిందే.

2 పాటలు మినహా మిగతా డబ్బింగ్ పనులన్నీ పూర్తయినట్లు క్లారిటీ ఇచ్చేశారు. మరికొన్ని పోస్ట్ ప్రొడక్షన్ పనులు మాత్రమే మిగిలి ఉన్నాయట. అయితే ఆ సినిమా రిలీజ్ అక్టోబర్ 13 అని పోస్టర్ లో చెప్పినప్పటికీ పరిస్థితులు అనుకూలిస్తే గాని సినిమాని రిలీజ్ చేసే ఛాన్స్ లేదట. థర్డ్ వేవ్ వస్తే సంక్రాంతికి షిఫ్ట్ చేయడం కాయం. ఇక అది కూడా కుదరకపోతే సమ్మర్ లోనే ఫిక్స్ చేసుకునేందుకు ప్లాన్ చేసుకున్నట్లు సమాచారం. మరి పరిస్థితులు ఎంత వరకు అనుకూలిస్తాయో చూడాలి.


Post a Comment

Previous Post Next Post