సాహో నటి ఇంట్లో విషాదం!


ప్రముఖ బాలీవుడ్ చిత్రనిర్మాత మరియు నటి మందిరా బేడి భర్త రాజ్ కౌషల్ మరణం వార్తతో హిందీ చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా షాక్ అయ్యింది. మీడియా నివేదికల ప్రకారం, 50 ఏళ్ల వయసు గల రాజ్ బుధవారం తెల్లవారుజామున 4:30 గంటలకు గుండెపోటుత కారణంగా ముంబైలోని తన నివాసంలోనే కన్నుమూశారు. కొద్దిసేపటి క్రితమే ఆయన అంత్యక్రియలు బాంద్రాలో జరిగాయి.

రాజ్ కౌషల్ 'షాదీ కా లడ్డూ' - 'ప్యార్ మెయిన్ కబీ కబీ' వంటి చిత్రాలకు దర్శకత్వం వహించాడు. అలాగే విమర్శకుల ప్రశంసలు పొందిన బాలీవుడ్ చిత్రం మై బ్రదర్ నిఖిల్ ను కూడా నిర్మించాడు.  అతను 1999 లో సాహో ఫేమ్ మందిరా బేడిని వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు, కుమారుడు వీర్ మరియు కుమార్తె తారా ఉన్నారు.  కరోనావైరస్  మొదటి దశలో తారాను వారు దత్తత తీసుకున్నారు.


Post a Comment

Previous Post Next Post