నెంబర్ వన్ పాన్ ఇండియా స్టార్ గా క్రేజ్ అందుకున్న రెబల్ స్టార్ ప్రభాస్ తో సినిమా అంటే ఇప్పుడు టెక్నీషియన్స్ సెలెక్ట్ చేసుకోవడం దర్శకులకు పెద్ద తలనొప్పిగా మారింది. బహుబలి అనంతరం ఆ విషయం చాలా క్లారిటీగా అర్ధమయ్యింది. సాధారణంగా ఒక మ్యూజిక్ డైరెక్టర్ ను కరెక్ట్ గా యూజ్ చేసుకోగలిగితే బాగానే ఉంటుంది కానీ యూవీ నిర్మతల ప్లాన్స్ ఏమిటో గాని ఇద్దరు ముగ్గురిని అనుకుంటున్నారు.
ఇక ఇప్పుడు రాధేశ్యామ్ కోసం కూడా నిర్మాతలు అదే పాట పాడుతున్నారు. మళయాళం మ్యూజిక్ డైరెక్టర్ జస్టిన్ ప్రభాకరన్ ను సౌత్ కోసం సెలెక్ట్ చేసుకోగా నార్త్ ఫ్లేవర్ కోసం మిథున్, మనన్ భరద్వాజ్ అనే మరో ఇద్దరిని సెలెక్ట్ చేసుకుంటున్నారు. వాళ్ళు మరో మూడు పాటలను కంపోజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక సినిమా సెట్స్ పైకి వచ్చి రెండేళ్లవుతున్నా కూడా ఇంతవరకు ఒక్క పాటను కూడా విడుదల చేయలేదు. మరి రాధేశ్యామ్ మ్యూజికల్ గా ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
Follow @TBO_Updates
Post a Comment